Andhra Pradesh: వైసీపీ అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా

  • ఈరోజు ప్రకటించాల్సిన వైసీపీ తొలి జాబితా వాయిదా
  • రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్
  • అక్కడి నుంచి విశాఖకు జగన్ వెళతారని సమాచారం
ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ఇంత వరకూ ప్రకటించలేదు. సుమారు వారం రోజుల క్రితం వైసీపీ తొలి జాబితా విడుదల చేయాలనుకున్నప్పటికీ ముహూర్త సమయం దాటిపోవడంతో వాయిదా వేశామని, ఈ నెల 16న ప్రకటిస్తామని అప్పుడు ప్రకటించింది. అయితే, వైసీపీ తొలి జాబితా ఈరోజు కూడా ప్రకటించడం లేదని, వాయిదా వేసినట్టు సమాచారం.  

 ఇదిలా ఉండగా, వైసీపీ అధినేత జగన్ రేపు ఉదయం ఇడుపులపాయ వెళ్లనున్నారు. అక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనంతరం, ఇడుపులపాయ నుంచి విశాఖకు జగన్ వెళతారని సమాచారం. నెల్లిమర్ల, పి.నర్సీపట్నం, పి.గన్నవరంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.
Andhra Pradesh
YSRCP
Jagan
elections

More Telugu News