Andhra Pradesh: కోటి మంది చెల్లెమ్మలు ఉన్న అన్నగా ఉండటం నా అదృష్టం: చంద్రబాబు

  • ‘పసుపు-కుంకుమ’ కింద రూ.10 వేలు ఇచ్చాం
  • రైతు కుటుంబంలో పుట్టా, వారి కష్టాలు తెలుసు
  • చదువుకునే పిల్లలకు ‘గార్డియన్’లా  ఉన్నా
కోటి మంది చెల్లెమ్మలు ఉన్న అన్నగా ఉండటం తన అదృష్టమని సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు రూ.10 వేలు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఈ పథకం కింద మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులను, వృద్ధులను ఆదుకుంటున్నామని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టానని, వారి కష్టాలు తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు, రైతుకు పెద్దన్నగా ఉండి వారి బాధ్యత తీసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు.  రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చానని, చదువుకునే పిల్లలకు ‘గార్డియన్’లా తాను ఉన్నానని చెప్పారు. 
Andhra Pradesh
Chandrababu
cm
Telugudesam
tirupathi

More Telugu News