Andhra Pradesh: కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: చంద్రబాబు

  • తెలుగు తమ్ముళ్లు దేనికీ భయపడరు
  • మా వద్ద నాటకాలు ఆడితే తగినబుద్ధి చెబుతాం
  • ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని?
తెలుగు తమ్ముళ్లు దేనికీ భయపడరని, కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తమ వద్ద నాటకాలు ఆడితే తగినబుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఏపీకి విద్యుత్ బకాయిల కింద తెలంగాణ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఇవ్వాలని, ఆ బకాయిలు చెల్లించకపోగా, తిరిగి మనమీదే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశారని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీకి నాడు మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి 18 హామీలిచ్చారని, అందులో, ఏ ఒక్క హామీని నెరవేర్చుకోలేదని విమర్శించారు. ఐటీ, సీబీఐ, ఈడీ అధికారులతో తమ నాయకులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh
Chandrababu
Tirupati
elections

More Telugu News