Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాలి.. విజయఢంకా మోగించిన చంద్రబాబు

  • తిరుపతిలోని తారకరామ మైదానంలో ఎన్నికల ప్రచారం
  • 1982 నుంచి పార్టీ కార్యకర్తలంతా జెండా మోశారు
  • టీడీపీకి మంచి పేరు వచ్చిందంటే వారి కష్టాల ఫలితమే
పనులను విభజించుకుని ప్రచారంలో దూసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో విజయఢంకా మోగించి టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించామని, తమ అభ్యర్థులను 90 శాతం మంది ఆమోదించారని సంతోషం వ్యక్తం చేశారు.

తమ పార్టీలో యాభై వేల మంది నాయకులు ఉన్నారని, టీడీపీలో పై నుంచి కింది వరకు అందరికీ సమాచారం ఉండాలని అన్నారు.1982 నుంచి పార్టీ కార్యకర్తలంతా పార్టీ జెండా మోశారని, టీడీపీకి మంచి పేరు వచ్చిందంటే వారి కష్టాల ఫలితమేనని అన్నారు. పార్టీ రక్షణ కోసం త్యాగం చేసిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని, కార్యకర్తల వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలిగామని చెప్పారు.
Andhra Pradesh
Tirupati
cm
Chandrababu
Telugudesam

More Telugu News