Andhra Pradesh: కడపలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆడియో రిలీజ్.. ఈవెంట్ కు ఎన్టీఆర్ నైట్ అని పేరుపెట్టిన వర్మ!

  • కడప జిల్లాలో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్
  • కార్యక్రమం తేదీని త్వరలోన ప్రకటిస్తానన్న వర్మ
  • ట్విట్టర్ లో వివరాలు తెలియజేసిన దర్శకుడు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి  ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది. ఈవెంట్  పేరు.. “వెన్ను  పోటు” అలియాస్  ఎన్టీఆర్  నైట్. ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియజేస్తాం. జై ఎన్టీఆర్.. #LakshmiNTR’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Kadapa District
lakshmies ntr
ntr night
audio release
RGV

More Telugu News