Vijayawada: రాజకీయ నేతలకు రక్షణ కరవైంది: వైసీపీ నేత మల్లాది

  • వైఎస్ వివేకా హత్యపై వైసీపీ నేతల నిరసన
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన  
  • వివేకా హత్యపై థర్డ్ పార్టీతో విచారణ చేయించాలి
ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, రాజకీయ నేతలకు రక్షణ కరవైందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ  సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విజయవాడలో మీడియతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, వివేకా హత్యపై థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీని బలహీనపర్చాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
Vijayawada
YSRCP
malladi
vishnu
ys viveka

More Telugu News