saipallavi: సాయిపల్లవి తాజా చిత్రంగా 'అథిరన్'

  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీ 
  • ప్రతిభకు తోడైన విజయాలు
  • మూడేళ్ల తరువాత మలయాళ సినిమా      
తెలుగు తెరకి పరిచయమైన ప్రతిభగల కథానాయికల జాబితాలో సాయిపల్లవి ముందు వరుసలో కనిపిస్తుంది. నటన పరంగా సాయిపల్లవి ప్రతిభకు సక్సెస్ కూడా తోడుకావడంతో, తెలుగు .. తమిళ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. ఇంత బిజీగా ఉండటం వల్లనే తన మాతృభాష అయిన మలయాళంలో 3 సంవత్సరాలుగా సినిమా చేయలేకపోయింది.

మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మలయాళంలో ఆమె 'అథిరన్' అనే ఒక సినిమా చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాసిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవల కాలంలో తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవి చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. అందువలన ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
saipallavi
fahad fazil

More Telugu News