akshay kumar: బీజేపీ తరపున పోటీ చేయనున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్

  • ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేను
  • సినిమాల ద్వారానే ప్రజలకు చేరువయ్యాను
  • సినిమాలతోనే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగాలకు అక్షయ్ కుమార్ తెరదించారు. సినిమాల ద్వారా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని తాను అనుకుంటున్నానని... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. సినిమాల ద్వారానే తాను ప్రజలకు చేరువయ్యానని... సినిమాల ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

తాను నటించిన 'టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ' చిత్రం ద్వారా దేశంలో చాలా మార్పు వచ్చిందని అక్షయ్ చెప్పారు. అలాగే 'ప్యాడ్ మ్యాన్' సినిమాతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం మార్పులు సంతరించుకున్నాయని తెలిపారు.
akshay kumar
bollywood
bjp

More Telugu News