pulivendula: వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం... సిట్‌ అదుపులో నలుగురు

షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, విపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌ వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిట్‌ నలుగురిని అదుపులోకి తీసుకుంది. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వివేకాను దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

 ఇందులో భాగంగా వివేకా ఇంట్లో వంట చేసే మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు అశోక్‌, వివేకా కారు డ్రైవర్‌ ప్రసాద్‌, పీఏ కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, వివేకానంద అంత్యక్రియలు ఈరోజు ఉదయం 11 గంటలకు పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌లో జరగనున్నాయి. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు పులివెందులకు తరలి వస్తున్నారు.
Go Back to Shorts
pulivendula
ys vivekananda
SIT

More Telugu News