Chandrababu: చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ కర్నూలులో చండీహోమం

  • టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని యాగం
  • జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు క్రతువు
  • హాజరైన నేతలు
రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కర్నూలులో టీడీపీ నేతలు చండీహోమం నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ హోమం శుక్రవారం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈ హోమం నిర్వహించినట్టు నేతలు తెలిపారు.


కర్నూలులోని గాయత్రీ ఎస్టేట్ విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ హోమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగింది. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల గెలుపు కోసమే ఈ యాగం నిర్వహించినట్టు ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. తన కుమారుడు భరత్‌ పేరు రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని, తాను తన కుమారుడి గెలుపు కోసం ప్రార్థించినట్టు వెంకటేశ్ పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
Kurnool District
Chandi Yagam
TG Venkatesh
Andhra Pradesh

More Telugu News