Jagan: బాబాయ్ మృతదేహం వద్దకు చేరుకున్న జగన్

  • కారులో పులివెందుల వచ్చిన జగన్
  • నేరుగా వివేకా నివాసానికి పయనం 
  • చిన్నాన్న భౌతికకాయానికి నివాళులు
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకుని చిన్నాన్న వివేకానందరెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పులివెందుల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వివేకా మృతి వార్త విన్న జగన్ స్థాణువయ్యారు. ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా, అన్నింటినీ పక్కనబెట్టి కారులో రోడ్డుమార్గం ద్వారా పులివెందుల బయల్దేరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పులివెందులలోని వైఎస్ వివేకా నివాసానికి చేరుకున్న జగన్ ను చూసి అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. బాబాయ్ భౌతికకాయాన్ని చూసి చలించిపోయిన జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను అడిగి ఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. మరికాసేపట్లో జగన్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి.
Jagan
YSRCP

More Telugu News