sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • కొనసాగుతున్న బుల్ ర్యాలీ
  • ఒకానొక దశలో 420 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 4 శాతం పైగా లాభపడ్డ కొటక్ మహీంద్రా బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, బలోపేతమైన రూపాయి, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు తదితర కారణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు బలపడింది. చివరి గంటల్లో కొన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో... కొంతమేర లాభాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో 38,024కు పెరిగింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 11,427కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (4.31%), ఓఎన్జీసీ (2.84%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.61%), టీసీఎస్ (2.59%), ఎన్టీపీసీ (2.50%).
 
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనీలివర్ (-2.23%), యస్ బ్యాంక్ (-1.92%), భారత్ ఎయిర్ టెల్ (-1.71%), ఐటీసీ (-1.52%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.39%).   

More Telugu News