Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలి: మాయావతి

  • లక్నోలో పవన్, మాయావతి భేటీ
  • మాయావతి పీఎం కావాలన్న పవన్
  • పవన్ సీఎం అవ్వాలంటూ మాయావతి కామెంట్
లక్నో నగరంలో శుక్రవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మాయావతి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మాయావతి కూడా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాయా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ... జనసేన, ఇతర కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీచేస్తుందని వెల్లడించారు. దేశంలో ఇతర కూటముల కంటే తమ కూటమే బలంగా ఉందని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటివారంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటానని మాయావతి తెలిపారు. తమ మధ్య సీట్ల కేటాయింపు, పంపకాల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు రాలేదని అన్నారు.
Pawan Kalyan

More Telugu News