Andhra Pradesh: చంద్రబాబు ఇంటికి వెళ్లిన వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి!

  • మదనపల్లె సీటు ఇచ్చేందుకు జగన్ నో
  • ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి నేత
  • ఇంకా మదనపల్లె అభ్యర్థిని ప్రకటించని చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా వైసీపీ మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న తిప్పారెడ్డి.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో మదనపల్లె టికెట్ ను తిప్పారెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సమావేశమైన తిప్పారెడ్డి.. మదనపల్లె సీటును కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో తిప్పారెడ్డికి చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల టీడీపీ 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉండగా, కేవలం 8 సీట్లకు మాత్రమే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు.
Andhra Pradesh
Chandrababu
Chittoor District

More Telugu News