Telugudesam: మహేశ్ బాబు పేరు చెప్పి మంగళగిరి షాలిమార్ టైలర్స్ కు ఫ్రీగా పబ్లిసిటీ చేసిన గల్లా జయదేవ్

  • మంగళగిరిలో టీడీపీ ఎంపీ 'ఆత్మీయ' ప్రసంగం
  • కార్యకర్తలతో ముచ్చటించిన యువనేత
  • ధరించిన దుస్తులపై వివరణ
తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఎంతో ఆలోచనాపరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండడంతో పాటు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా గళం విప్పగల ధైర్యశాలిగా పార్టీ వర్గాల్లో మన్ననలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన మంగళగిరిలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సరికొత్తగా పసుపు దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా తన డ్రెస్సులు కుట్టిన మంగళగిరి షాలిమార్ టైలర్స్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

"షాలిమార్ టైలర్స్ నా టైలర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. మొన్న హైదరాబాద్ వస్తే మహేశ్ బాబు వద్దకు కూడా తీసుకెళ్లి పరిచయం చేశాను. అంతేకాదు, మహేశ్ బాబు కొలతలు కూడా ఇప్పించాను. ఇప్పుడు షాలిమార్ టైలర్స్ నా టైలరే కాదు మహేశ్ బాబుకూ టైలర్... రాబోయే రోజుల్లో లోకేశ్ బాబుకూ టైలర్ అవుతారు" అని పేర్కొన్నారు. మంగళగిరి షాలిమార్ టైలర్స్ తన డ్రెస్సులు కుడతాడని, ఇకమీదట మహేశ్ బాబు, నారా లోకేశ్ కూడా డ్రెస్సులు ఇక్కడే కుట్టించుకుంటారని అన్నారు గల్లా జయదేవ్. తన డ్రెస్ మేడ్ ఇన్ మంగళగిరి అని గర్వంగా చెప్పుకోగలనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Telugudesam
Mahesh Babu
Nara Lokesh

More Telugu News