Andhra Pradesh: మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నా!: పవన్ కల్యాణ్

  • ఇది మా కోరిక మాత్రమే కాదు ఆకాంక్ష కూడా
  • బీఎస్పీతో పొత్తు కుదరడం సంతోషంగా ఉంది
  • లక్నోలో మీడియాతో మాట్లాడిన జనసేనాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు కలసి పోటీచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీ దాదాపుగా ఖరారయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈరోజు పవన్ కల్యాణ్, మాయావతి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మాయావతిని భారత ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇది తమ కోరిక మాత్రమే కాదనీ, బలమైన ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బడుగుబలహీన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని తేల్చిచెప్పారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telangana
Jana Sena
bsp
Pawan Kalyan
mayawati
alligence

More Telugu News