ys viveka: చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వైఎస్ వివేకా!
- జగన్ ను సీఎంగా చూడాలన్న కోరిక
- ఈ ఎన్నికలే కీలకమని వ్యాఖ్యానించిన వివేకా
- గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు
వైఎస్ వివేకానందరెడ్డి తన చివరి కోరికను తీర్చుకోకుండానే వెళ్లిపోయారని ఆయన అభిమానులు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ తెల్లవారుజామున తన ఇంట్లోని స్నానాల గదిలో ఆయన గుండెపోటుతో మరణించగా, విషయం తెలుసుకున్న పులివెందుల ప్రజలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చి, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తనకు ఈ జీవితంలో ఉన్న ఏకైక కోరిక, అన్న కుమారుడైన వైఎస్ జగన్ ను సీఎంగా చూడటమేనని ఆయన ఇటీవలి కాలంలో పలుమార్లు చెప్పినట్టు వివేకా అభిమానులు అంటున్నారు. జగన్ ను సీఎం పదవిపై కూర్చోబెట్టేందుకు కృషి చేస్తున్నానని, అందుకు త్వరలో జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఆయన అంటుండేవారని, తనకు కుమారులు లేకపోవడంతో అన్న కుమారుడినే సొంత కుమారుడిగా ఆయన చూసుకుంటున్నారని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు.