Chandrababu: రేపు తిరుమలకు చంద్రబాబు.. 20న ఎన్నికల శంఖారావం
- 17న తిరుపతిలో కార్యకర్తలతో సమావేశం.. అదే రోజు శ్రీకాకుళంలో పర్యటన
- ఈ నెల 19లోపు రాష్ట్రాన్ని చుట్టేయనున్న సీఎం
- ఎన్నికలకు అభిమానులు, కార్యకర్తలను సిద్ధం చేస్తానన్న బాబు
గురువారం పొద్దుపోయాక 126 మందితో కూడిన తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్టు తెలిపారు. అనంతరం తిరుపతిలో చిత్తూరు జిల్లా కార్యకర్తలు, సేవా మిత్రల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.
అదే రోజున శ్రీకాకుళంలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటానని తెలిపారు. 17న విజయనగరం, విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల కార్యకర్తలు, సేవామిత్రలతో సమావేశం నిర్వహిస్తానని, 18న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కార్యకర్తలు, సేవామిత్రల సమావేశంలో పాల్గొంటానని వివరించారు. కార్యకర్తలను, అభిమానులను యుద్ధానికి సన్నద్ధం చేసిన అనంతరం ఈ నెల 20న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తానని చంద్రబాబు తెలిపారు.