Guntur District: చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి రజనీ ప్రచారంలో విషాదం

  • మద్యం మత్తులో రెచ్చిపోయిన కార్యకర్తలు
  • బ్యాండ్‌ బృందంపైకి బైక్‌తో దూసుకెళ్లడంతో కలకలం
  • ఒకరి మృతి, పలువురికి గాయాలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి రజనీ ప్రచారంలో పెను విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బైక్‌లపై వీరవిహారం చేసిన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. నాదెండ్ల మండలం గణపవరంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇది కాస్తా శ్రుతి మించింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో కొందరు కార్యకర్తలు బ్యాండ్ బృందంపైకి బైక్‌తో దూసుకెళ్లారు. ఈ ఘటనలో బ్యాండ్ బృందం సభ్యుడు హుస్సేన్ మృతి చెందాడు. మరికొందరు గాయపడినట్టు సమాచారం. దీంతో ప్రచారం రసాభాసగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం అందాల్సి ఉంది.
Guntur District
Chilakaluripet
YSRCP
Rajani
Andhra Pradesh

More Telugu News