Chandrababu: టీడీపీలోకి కేంద్ర మాజీమంత్రి పనబాక దంపతులు.. చంద్రబాబు సమక్షంలో చేరిక

  • టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
  • గురువారం రాత్రి భర్తతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్న లక్ష్మి
  • ఎన్నికల్లో ఒంటరిపోరేనన్న చంద్రబాబు
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో రాజకీయ వేడి పూర్తిస్థాయిలో రాజుకుంది. ప్రధాన పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఓవైపు టికెట్ల కేటాయింపు జరుగుతున్నా.. మరోవైపు రాకపోకలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య గురువారం రాత్రి పొద్దుపోయాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
 
కాగా, రాత్రి 11 గంటల సమయంలో 126 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ జుట్టు మోదీ, కేసీఆర్ చేతుల్లో ఉందని, ఆయనకు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనన్నారు. అదే జరిగితే ఇప్పటికంటే మరిన్ని ఎక్కువ అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ కోరుకున్న ప్రభుత్వం ఏపీలో వస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆత్మగౌరవమే ప్రధాన నినాదం కాబోతోందని, ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.  
Chandrababu
Panabaka Laxmi
Andhra Pradesh
Telugudesam
Elections

More Telugu News