Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీచేయడం నా పూర్వజన్మ సుకృతం: నారా లోకేశ్

  • ప్రచారం ప్రారంభించిన ఏపీ మంత్రి
  • ఐటీ అభివృద్ధికి కృషి చేస్తా
  • కేంద్రం కక్ష సాధిస్తోందంటూ ఆరోపణలు
ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మొదట భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారంటూ లోకేశ్ పోటీపై వార్తలొచ్చినా టీడీపీ హైకమాండ్ మాత్రం మంగళగిరి టికెట్ కేటాయించింది. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేశ్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని రావడం అదృష్టమని లోకేశ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, తన ప్రచారంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Telugudesam

More Telugu News