Chandrababu: ఎన్నికలకు ముందు పార్టీ 'ఇన్‌చార్జుల' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు

  • ఇన్‌చార్జుల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం
  • ఓడిన అభ్యర్థులు ఇన్‌చార్జిగా వ్యవహరించేవారు
  • పెత్తనానికి చెక్ పెట్టేందుకే నిర్ణయం
ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఇన్‌చార్జుల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు. కొంత కాలంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే నియోజకవర్గ కార్యకర్తలపై కొందరు ఇన్‌చార్జులు పెత్తనం కూడా అదే స్థాయిలో చలాయించేవారు. వారికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu
Incharge
Constency
Telugudesam

More Telugu News