Pawan Kalyan: ఇంటర్ లో చదువు ఆపేసినా చదవడం మాత్రం ఆపలేదు... తలతెగిపడాలే కానీ వెనుకడుగు వేయను: పవన్

  • ఎంతో బెదిరించారు
  • అయినా వెనక్కి తగ్గలేదు
  • ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతున్నాడంటూ ధీమా
ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ స్పష్టంగా చెప్పారు పవన్ కల్యాణ్. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్స సభలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. తాను ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసినా పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు.

మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ మనిషి ఎవరు, ఏ కులం, ఏ మతం? అంటూ వర్గీకరణ చేసి చూడలేదని చెప్పారు. జనసేనను స్థాపించినప్పుడు తానొక్కడినే అని, కానీ ఇప్పుడు ఓ సైన్యం తన వెంట ఉందని అన్నారు. నాలుగేళ్లుగా తనను ఎన్నోరకాలుగా బెదిరించారని, అయినా వెనుకంజ వేయలేదని తెలిపారు. ముందుకు అడుగేస్తే తల తెగిపడాలే కానీ మడమతిప్పడం పవన్ కల్యాణ్ కు తెలియదన్నారు. ఇప్పుడో కానిస్టేబుల్ కొడుకు 2019లో సీఎం అవుతున్నాడని, తనకు గెలుపోటములతో సంబంధంలేదని, యుద్ధం చేయడమే తెలుసని చెప్పారు.
Pawan Kalyan
Jana Sena

More Telugu News