Nara Lokesh: యంగ్ గ్లోబల్ లీడర్ గా నారా లోకేష్

  • ఏపీ మంత్రికి వరల్డ్ గ్రూప్ లో చోటు
  • దక్షిణాసియా యువనేతగా జాబితాలో పేరు
  • గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటూ ట్వీట్ చేసిన లోకేశ్
ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన యువనేతల జాబితాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్థానం సంపాదించుకున్నారు. యంగ్ గ్లోబల్ లీడర్స్ ఫోరం తాజాగా విడుదల చేసిన క్లాస్ ఆఫ్ 2019 యువనేతల జాబితాలో నారా లోకేశ్ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో విశేష కృషి చేయడమే కాకుండా, తమదైన ముద్ర వేసిన యువతీయువకులను ఈ జాబితాకు ఎంపిక చేశారు. మొత్తం 127 మంది ఉన్న యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేశ్ దక్షిణాసియా విభాగంలో ఉన్నారు.

తనకు ఈ అపురూపమైన గౌరవం దక్కడం పట్ల నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్ యంగ్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2019 జాబితాలో తన పేరు కూడా ఉండడం పట్ల ట్విట్టర్ లో స్పందన తెలియజేశారు. వరల్డ్ గ్రూప్ లో తనకు కూడా స్థానం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ జాబితాలో ఉన్న ఇతర యంగ్ లీడర్స్ కు తన శుభాభినందనలు తెలిపారు. త్వరలోనే అందరితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News