Andhra Pradesh: జగన్ మాట ఇస్తే తప్పడు.. ఆయన్ను గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకుందాం!: సినీ నటుడు అలీ

  • పార్టీలకు అతీతంగా పేదలను వైఎస్సార్ ఆదుకున్నారు
  • అందుకే వైఎస్సార్ అంటే నాకు చాలా ఇష్టం
  • త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది పేదలను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలకు అతీతంగా ఆదుకున్నారని సినీనటుడు అలీ తెలిపారు. అందుకే వైఎస్సాఆర్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. వైఎస్సార్ కుమారుడు జగన్ మాట ఇస్తే తప్పరని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఆర్ఎస్ ఆర్ కల్యాణ్ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి జగన్ అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను గెలిపించి ముఖ్యమంత్రిగా చేద్దామని పిలుపునిచ్చారు. త్వరలోనే ఏపీలో రాజన్న రాజ్యం వస్తుందన్నారు. ఇటీవల జగన్ సమక్షంలో అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Jagan
YSRCP
ali
actor
nellore

More Telugu News