cbi: ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన

  • ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన లక్ష్మీనారాయణ
  • తటస్థంగా ఉంటానని వెల్లడి
  • ప్రజాసేవ కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని వ్యాఖ్య
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని ఆయన ప్రకటించారు. తటస్థంగా ఉంటానని చెప్పారు. ప్రజాసేవ-ఎన్జీవో కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు. మరోవైపు, ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మీనారాయణ చెప్పినట్టు సమాచారం. టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయి, పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికే, ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు.
cbi
lakshminarayana
politics
elections

More Telugu News