rayapati: అసంతృప్తిలో ఉన్న రాయపాటి సోదరులకు వైసీపీ నుంచి ఫోన్ కాల్స్

  • నరసరావుపేట టికెట్ ఇవ్వలేమన్న హైకమాండ్
  • వైసీపీలో చేరే విషయంపై రాయపాటి సమాలోచనలు
  • సాయంత్రానికి ప్రకటన వెలువడే అవకాశం
నరసరావుపేట లోక్ సభ టికెట్ ను ఇవ్వలేమని రాయపాటి సాంబశివరావుకు టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ స్థానం కోసం భాష్యం రామకృష్ణ పేరును పరిశీలిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో, రాయపాటి సోదరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన కంటే మంచి అభ్యర్థి ఉంటే వారికే టికెట్ ఇచ్చుకోండని రాయపాటి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరోవైపు, రాయపాటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలుసుకున్న వైసీపీ కీలక నేతలు వెంటనే రంగంలోకి దిగారు. రాయపాటి వర్గీయులకు ఫోన్ ద్వారా రాయబారం పంపారు. మరోవైపు, తన కుటుంబసభ్యులతో రాయపాటి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలోనే ఉండాలా? వైసీపీలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే విషయాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఏదో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.
rayapati
Telugudesam
ysrcp
ticket

More Telugu News