Ramgopalvarma: నా సినిమాను ఎవరూ ఆపలేరు: రామ్ గోపాల్ వర్మ

  • సెన్సార్ బోర్డు ప్రశ్నిస్తే సమాధానం చెబుతా
  • టీడీపీ డిమాండ్ చేసినట్టుగా సినిమా ఆగదు
  • చిత్రాన్ని ఆపాలంటున్న తెలుగుదేశం
తాను నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా ఎవరూ ఆపలేరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, సెన్సార్ బోర్డు మినహా ఎవరూ సినిమాను ఆపలేరని అన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని భావించి, సెన్సార్ బోర్డు అడ్డుకుంటే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం వారు డిమాండ్ చేసినట్టుగా సినిమాను ఆపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని విలన్ గా చూపిస్తున్నారని, ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Ramgopalvarma
Lakshmis NTR
Telugudesam
Chandrababu

More Telugu News