Andhra Pradesh: పాయకరావు పేట, కొవ్వూరు, తిరువూరు, కైకలూరు అభ్యర్థులు వీరే.. ప్రకటించిన చంద్రబాబు!

  • పాయకరావు పేట నుంచి బంగారప్పకు ఛాన్స్
  • కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత
  • జయమంగళ వెంకట రమణకు కైకలూరు సీటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏపీ సీఎం.. తాజాగా ఈరోజు మరో నాలుగు రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విశాఖలోని పాయకరావు పేట నియోజకవర్గం నుంచి బంగారయ్యను పోటీకి దించాలని చంద్రబాబు నిర్ణయించారు.

అలాగే కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత పేరును టీడీపీ అధినేత ఖరారు చేశారు. తిరువూరు నుంచి మంత్రి జవహర్ కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. చివరగా కైకలూరు టికెట్ ను జయమంగళ వెంకటరమణకు చంద్రబాబు ఖరారు చేశారు. అంతకుముందు చింతలపూడి టికెట్ ను కర్రా రాజారావుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

మరోవైపు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉగ్ర నరసింహారెడ్డి అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబుతో సమావేశమైన నరసింహారెడ్డి తన అభిప్రాయాన్ని ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
4 RESERVED CANDIDATE
announcement

More Telugu News