Jagan: చేరికల జోరు... వైసీపీలో చేరిన కర్నూలు టీడీపీ నేత లబ్బి వెంకటస్వామి.. స్వాగతం పలికిన జగన్!

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత
  • ఎన్నికల వేళ కొనసాగుతున్న వలసల జోరు
  • జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్న లబ్బి
కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లబ్బి వెంకటస్వామి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటస్వామి వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న జగన్, స్వయంగా ఎదురొచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఆపై పార్టీ కండువాను ఆయన మెడలో వేసి, పార్టీలోకి స్వాగతం పలికారు. లబ్బి వెంకటస్వామి చేరిక పార్టీకి మరింత బలోపేతమని, ఆయన సేవలను సరైన రీతిలో వినియోగించుకుంటామని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా వస్తుందని తాను భావిస్తున్నట్టు ఈ సందర్భంగా వెంకటస్వామి వ్యాఖ్యానించారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని అన్నారు.
Jagan
Labbi Venkataswami
YSRCP

More Telugu News