Madhya Pradesh: డ్రగ్స్ కేసులో అరెస్టైన బీజేపీ ఎంపీ కుమారుడు.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం

  • ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ లో కలకలం
  • రాజ్యసభ సభ్యుడు సంపాతీయ కుమారుడు అరెస్ట్
  • 41 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంపాతీయ ఉయే కుమారుడు సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండ్ల టౌన్ లో సత్యేంద్రకు చెందిన హోండా బ్రియో కారులో 3,380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సత్యేంద్రతో పాటు అతని స్నేహితులు షారుఖ్, అభిషేక్ లపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపుతోంది.
Madhya Pradesh
bjp
mp
sampathiya
satyendra
drugs
arrest

More Telugu News