Prudhvi: నాకు, నాగబాబుకు మధ్య చిచ్చుపెట్టారు: సినీ హాస్య నటుడు పృథ్వీ

  • 2009 నుంచి నాగబాబు తెలుసు
  • జనసేన నిధులపై ఎన్నడూ మాట్లాడలేదు
  • నాగబాబుకు వివరణ ఇచ్చానన్న పృథ్వీ
2009లో ప్రజారాజ్యం పార్టీలో కార్యకర్తగా ఉన్న సమయం నుంచి నాగబాబు తనకు బాగా తెలుసునని, ఆయనతో తనకెన్నడూ విభేదాలు లేవని, అయితే, కొందరు పనిగట్టుకుని తమ మధ్య చిచ్చు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, నటుడు పృథ్వీ ఆరోపించారు.

జనసేనకు వస్తున్న నిధుల గురించి తాను ఎన్నడూ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. తాను రాయదుర్గంలో ఉన్న వేళ, నాగబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని, ఆ సమయంలో యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, తనను ఫోన్ చేయమని నాగబాబు చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని అన్నారు. ఆ వెంటనే రాత్రి 11 గంటలకు ఫోన్ చేశానని చెప్పారు. తానిచ్చిన సమాధానంతో నాగబాబు సంతృప్తి చెందారని అన్నారు. ఆ యాంకర్ అలా ఎందుకు చెప్పిందో తనకు తెలియదని అన్న పృథ్వీ, తనకు నాగబాబుకూ మధ్య కొందరు చిచ్చు పెట్టారని విమర్శించారు.
Prudhvi
Nagababu
Jana Sena

More Telugu News