Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఊరట... ఐదేళ్లనాటి కేసును కొట్టేసిన హైకోర్టు!

షార్ట్స్‌లో చూడండి
2014లో నమోదైన కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. అప్పట్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం చేశారని చిరంజీవిపై కేసు నమోదైంది. గుంటూరు పరిధిలోని అరండల్ పేట పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేస్తూ, చిరంజీవి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగాలు నమోదుచేశారు. ఈ చార్జ్ షీట్ ను కిందికోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి టీ రజని చేపట్టారు. తమ క్లయింట్ ప్రచారం ముగించుకుని వస్తుండగా, అక్రమ కేసు పెట్టారని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పిచ్చింది.
Go Back to Shorts
Chiranjeevi
High Court
Elections
Acquited

More Telugu News