Telugudesam: తమ్ముడూ అంటూనే జగన్ వెన్నుపోటు పొడిచాడు: వంగవీటి రాధా ఆవేదన

  • టీడీపీలో చేరిన రంగా తనయుడు
  • భారీ ఎత్తున అభిమానుల సందడి
  • పార్టీ కండువా కప్పిన చంద్రబాబు
విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘకాలం తమదైన ముద్రవేస్తున్న కుటుంబం వంగవీటి రంగా కుటుంబం. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రంగా తనయుడు వంగవీటి రాధా తాజాగా టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధాకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ఎప్పుడూ వెన్నుపోటు గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటాడని.. కానీ తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే వ్యక్తులతో కలిసిన నువ్వా విశ్వసనీయత గురించి మాట్లాడేది? అంటూ సూటిగా ప్రశ్నించిన ఈ బెజవాడ పొలిటీషియన్... ఇకనైనా మారు జగన్ రెడ్డీ, మంచిగా మారి ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత నిర్వర్తించు అంటూ హితవు పలికారు. ప్రజలు తప్పకుండా నీకు మళ్లీ ప్రతిపక్ష నేత హోదా అందిస్తారంటూ రాధా సెటైర్ వేశారు. రాధా మాట్లాడుతున్నంత సేపు అభిమానులు ఈలలు, చప్పట్లతో ఉత్సాహపరిచారు.
Telugudesam
Chandrababu
Vijayawada

More Telugu News