Andhra Pradesh: జేసీ తీరుతో కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్సీ శమంతకమణి

  • ప్రజావేదికలో ఎంపీ ఆగ్రహం
  • మనస్తాపం చెందిన శమంతకమణి
  • సర్ది చెప్పిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
అమరావతిలో బుధవారం నిర్వహించిన ప్రజావేదిక వద్ద అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ప్రవర్తించి వార్తల్లోకెక్కారు. ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే యామినీబాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శమంతకమణి, యామినీబాల ప్రజావేదిక వద్ద ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో మాట్లాడేందుకు రాగా, జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ఇష్టంవచ్చినట్టు అరవడంతో ఎమ్మెల్సీ శమంతకమణి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ దశలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సింగనమల టికెట్ ను బండారు శ్రావణికి ఇవ్వాలంటూ గత కొంతకాలంగా జేసీ టీడీపీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే సింగనమల టికెట్ తనకే ఇవ్వాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాల పట్టుబడుతున్నారు. ఈ కారణంగానే జేసీ నిప్పులు కక్కినట్టు అర్థమవుతోంది. ప్రజావేదిక సాక్షిగా జేసీ దూకుడు చూసిన ఇతర నేతలు కూడా ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
Andhra Pradesh
Telugudesam

More Telugu News