Devegouda: మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న దేవెగౌడ

  • ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చాను
  • చాలా సపోర్ట్ అందించాను
  • మా కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తామంటే తప్పు పడుతున్నారు
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తన మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటించే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు. నేడు ఆయన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను హసన్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. హోలెనర్సీపూర్ తాలుకా ముదలహిప్పె గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన మనవడి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన దేవెగౌడ.. తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

పక్కనే ఉన్న ప్రజ్వల్.. దేవెగౌడను ఓదార్చారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి ఎంతో మందిని తీసుకొచ్చానని, చాలా సపోర్ట్ అందించానని అన్నారు. కానీ తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తామంటే మాత్రం తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజ్వల్‌ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Devegouda
Prajwal Revanna
Hassan Parliament
Holenarsipur

More Telugu News