Krishna District: గేదెను అమ్మే విషయంలో తలెత్తిన గొడవ.. గొడ్డలితో భార్య కాళ్లను నరికేసిన భర్త

  • నందిగామ ఆసుపత్రిలో రాజేశ్వరికి చికిత్స
  • తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేదన్న కుమార్తె
  • ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని వెల్లడి
చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారి చివరకు భార్య కాళ్లు నరికే వరకూ వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలోని లింగాలపాడు గ్రామంలో జి. పిచ్చయ్య, రాజేశ్వరి దంపతులు నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి పిచ్చయ్య ఇంటికి రాగానే భార్యాభర్తల మధ్య గేదెను అమ్మే విషయంలో వివాదం జరిగింది.

అది కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన పిచ్చయ్య గొడ్డలితో రాజేశ్వరి కాళ్లను నరికేశాడు. బాధితురాలు ప్రస్తుతం నందిగామలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే తమ తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ సఖ్యతతో లేరని.. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయని వారి కుమార్తె తెలిపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Krishna District
Lingalapadu
Pitchaiah
Rajeswari
Nandigama

More Telugu News