Chandrababu: 'బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా' అంటూ కేసీఆర్ కు జగన్ లొంగిపోయాడు!: చంద్రబాబు విమర్శలు

  • ఏపీ డీజీపీ ప్రహరీగోడ కూల్చేశారు
  • జగన్ నేరాలు ఆయనకు కనిపించలేదా?
  • జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్, కేసీఆర్, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ను ఓ రేంజ్ లో తూర్పారబట్టిన చంద్రబాబు... తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు చేశారు.

"ఆయనో మహానాయకుడు... మనమీదకు ఒంటికాలి మీద వస్తాడు. హైదరాబాద్ లో ఏపీ డీజీపీ ఇంటి ప్రహరీగోడ నిబంధనలకు విరుద్ధంగా కట్టారంటూ కేవలం ఆరోపణ మాత్రమే వచ్చింది. దానిమీద కోర్టు జోక్యం చేసుకున్నా గానీ తెల్లవారుజామునే ఎవరికీ తెలియకుండా ప్రహరీగోడ కూల్చేశారు.

మరి, జగన్ కొన్ని వందల నేరాలు చేస్తే మీకు కనిపించలేదా? ఎందుకు జగన్ పై చర్యలు తీసుకోలేదు?" అంటూ నిలదీశారు చంద్రబాబు. ఇవన్నీ కేసీఆర్, జగన్ లాలూచీ వ్యవహారాలకు నిదర్శనాలని మండిపడ్డారు. జగన్ పూర్తిగా కేసీఆర్ కు లొంగిపోయారని, బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా! అనే స్థితికి దిగజారిపోయారని విమర్శించారు.

Chandrababu
Telugudesam
KCR
Jagan

More Telugu News