Andhra Pradesh: తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు!: మంత్రి లోకేశ్ సెటైర్లు

  • నెల్లూరు జిల్లాలో టీఆర్ఎస్ గుర్తున్న కార్లు ప్రత్యక్షం
  • స్టిక్కర్లు, లోగోలు, సీట్లను మారుస్తున్న వైసీపీ నేతలు
  • వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా లోకేశ్ విమర్శలు
నెల్లూరు జిల్లాలో ఈరోజు టీఆర్ఎస్ గుర్తు ఉన్న కార్లను ప్రచారానికి వైసీపీ నేతలు సిద్ధం చేస్తుకుంటున్న ఫొటోలు నెట్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీపై నారా లోకేశ్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. తెలంగాణ దొరగారి(కేసీఆర్) కారులో ఆంధ్రా ప్రతిపక్ష నేత జగన్ షికారు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కలువకుంట జగన్ కూడా దొరగారి ప్ర‘గఢి’భవన్ గులాబీ తోటలోని పువ్వేనని సెటైర్లు వేశారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..
‘‘తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు!
వైకాపా కారు చూడ మేలిమై ఉండుసీటు
విప్పిచూడ కారు గుర్తు ఉండు.
రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ,
దొరగారి ప్ర``గఢీ``భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు!’’ అని ట్వీట్ చేశారు.

దీనికి  #KalvakuntaJagan  అని హ్యాగ్ ట్యాగ్ తో పాటు టీఆర్ఎస్ కార్ల వ్యవహారంలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ ను తన ట్వీట్ కు లోకేశ్ జతచేశారు..
Andhra Pradesh
Telangana
YSRCP
TRS
KCR
Jagan
Nara Lokesh
Twitter

More Telugu News