Andhra Pradesh: కోడెల వద్దు.. చంద్రబాబు ముద్దు.. సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేతల భేటీ!

  • కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు
  • ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వరాదని డిమాండ్
  • నరసరావుపేటపై ఏపీ స్పీకర్ చూపు
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేతలు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు వ్యతిరేకంగా సమావేశం అయ్యారు. ఈసారి సత్తెనపల్లి అభ్యర్థిగా కోడెలకు టికెట్ ఇవ్వరాదని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా అసమ్మతి నేతలు ‘కోడెల శివప్రసాద్ వద్దు.. చంద్రబాబు ముద్దు’ అని నినాదాలు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల ఈసారి నరసరావుపేట నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
Telugudesam
Guntur District
kodela
sattenpalli
rebel
Chandrababu

More Telugu News