Andhra Pradesh: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసు.. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు!

  • ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ
  • హాజరుకానున్న మమత, కేజ్రీవాల్, రాహుల్
  • సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేసిన నేతలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ మెషీన్ల విషయంలో విపక్ష పార్టీలు జోరు పెంచాయి. పోలింగ్ అనంతరం ఓట్లతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను సైతం లెక్కించాలని విపక్ష నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 15న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వేర్వేరుగా సమావేశమవుతారు. వీవీప్యాట్ లను లెక్కించాలని సుప్రీంకోర్టులో వీరంతా కలిసి పిటిషన్ ను దాఖలుచేసిన నేపథ్యంలో ఎల్లుండి అంటే ఈ నెల 15న వీరందరూ విచారణకు హాజరవుతారు.
Andhra Pradesh
VVPAT
Supreme Court
Rahul Gandhi
MAMATA
Arvind Kejriwal
Chandrababu
Telugudesam

More Telugu News