Tekkali: మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడులపై పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు!

  • టెక్కలిలో భారీ బైక్ ర్యాలీ
  • అనుమతి తీసుకోకుండా నిర్వహణ
  • 50 మంది టీడీపీ నేతలపై కేసు
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తమ అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని, ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమని అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు 50 మంది తెలుగుదేశం నేతలపై కేసులను నమోదు చేశారు. బైక్ ర్యాలీ ఖర్చును అంచనా వేసి, దాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేయనున్నట్టు తెలిపారు. నిన్న టెక్కలిలో తెలుగుదేశం శ్రేణులు ఈ ర్యాలీని భారీగా నిర్వహించాయి. వందలాది మంది తెలుగు యువత కార్యకర్తలు, ప్రధాన నేతల అనుచరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
Tekkali
Bike Rally
Kinjarapu Acchamnaidu
Rammohanrayudu

More Telugu News