Padmaja: చిత్తూరు టీడీపీ ఎంపీ సోదరికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్!

  • రాజకీయ తెరపైకి వచ్చిన పద్మజ
  • చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెల్లెలిగా గుర్తింపు
  • పూతలపట్టు టికెట్ ఖరారు
తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెల్లెలు పద్మజ అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చారు. పూతలపట్టు నుంచి తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ను నిరాకరించిన వైఎస్ జగన్, పద్మజకు ఆ స్థానాన్ని ఖరారు చేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటున్న పెద్దిరెడ్డి సహకారంతో పద్మజకు టికెట్ లభించినట్టు తెలుస్తోంది. తనకు టికెట్ ఇవ్వాలని కోరేందుకు సునీల్ రెండు రోజుల పాటు వేచిచూసినా, జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇదే పూతలపట్టు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు బరిలోకి ఉంటారన్న విషయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి మరో చాన్స్ రావచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో లలితకుమారిపై సునీల్ 624 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Padmaja
Chittoor District
MP
Putalapattu
Sivaprasad

More Telugu News