YSRCP: రేపు వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా... నేతల్లో టెన్షన్!

  • వైసీపీ మానిఫెస్టో కమిటీ కన్వీనర్ ఉమ్మారెడ్డి వెల్లడి
  • తొలిజాబితాలో 75 మంది
  • మరికొన్ని విడతల్లో మిగిలిన అభ్యర్థుల పేర్లు
వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ అభ్యర్థుల పేర్లు వెల్లడించడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. 75 మందితో బుధవారం తొలి జాబితా విడుదల చేయనున్నారు జగన్. ఈ మేరకు వైసీపీ మానిఫెస్టో కమిటీ కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. అభ్యర్థుల మొత్తం జాబితా సిద్ధమైందని, అయితే రేపు తొలి జాబితాలో 75 మంది పేర్లు ప్రకటిస్తామని చెప్పారు. అనంతరం, రోజుకు పాతికమంది చొప్పున మూడు రోజుల పాటు మరికొందరు పేర్లు వెల్లడిస్తామని ఉమ్మారెడ్డి వివరించారు.

తమ పార్టీకి ఇతర పార్టీల్లాగా రెబెల్స్, అసంతృప్తుల గొడవలు లేవని అన్నారు. అయితే, కొందరు నేతలు జగన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో తమ పేర్లు గల్లంతైనట్టేనని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో జాబితాలు విడుదలైతే తప్ప దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇక , టీడీపీ, జనసేన కూడా పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికలతో తలమునకలుగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ సైతం తొలిజాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News