Rampachodavaram: వైసీపీ నుంచి వచ్చిన వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు: టీడీపీ నేతల ఆందోళన

  • రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం 
  • సొంత పార్టీల నేతల నుంచే వ్యతిరేకత
  • చంద్రబాబు వద్దకు చేరిన పంచాయతీ
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అయితే టికెట్ల కేటాయింపునకు వచ్చే సరికి ఆయా పార్టీలకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ నేతల నుంచి ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది.

రంపచోడవరం టికెట్‌ను ఫణీశ్వరమ్మ, బాబు రమేశ్, సీతంశెట్టి ఆశిస్తున్నారు. కానీ అధిష్ఠానం మాత్రం .. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరికి టికెట్ కేటాయించాలని భావిస్తోంది. ఆమెకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలే అడ్డుతగులుతుండటంతో పంచాయతీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
Rampachodavaram
Vanthala Rajeswari
Chandrababu
Phaniswaramma
Babu Ramesh
YSRCP

More Telugu News