kamal: కమల్ కోరికమేరకే 'భారతీయుడు 2' షూటింగ్ ఆపేశారట!

  • శంకర్ నుంచి 'భారతీయుడు 2'
  • కథానాయికగా కాజల్ అగర్వాల్
  • రాజకీయ వ్యవహారాల్లో బిజీగా కమల్            
శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. మూడవ షెడ్యూల్ కి సంబంధించిన అప్ డేట్స్ బయటికి రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దర్శక నిర్మాతల మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ వచ్చింది.

కానీ అసలు కారణం అది కాదట .. ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారట. ఎన్నికలు పూర్తయిన తరువాత షూటింగు పెట్టుకోవలసిందిగా ఆయన కోరడంతో, దర్శక నిర్మాతలు ఆ తరువాతనే 3వ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. కొంత సమయం తీసుకుని మళ్లీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.
kamal
kajal

More Telugu News