YSRCP: పట్టువదలని పీవీపీ... రేపు వైసీపీలో చేరిక!

  • జగన్ సమక్షంలో తీర్థం పుచ్చుకునే అవకాశం
  • విజయవాడ లోక్ సభ స్థానంపై గురి
  • గతంలో దక్కని బెజవాడ సీటు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో చేరికలు, వీడ్కోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలానా నాయకుడు కచ్చితంగా ఈ పార్టీలో ఉంటాడు అని చెప్పే పరిస్థితి కనిపించడంలేదు. కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టే వాళ్లు కూడా పైరవీలు జోరుగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంటు స్థానంపై మక్కువ పెంచుకున్న పీవీపీ అప్పట్లో జగన్ నుంచి సరైన హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎన్నికలు రావడంతో పీవీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బెజవాడ టికెట్ పై ఈసారి స్పష్టమైన హామీ రావడంతో పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. జగన్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే పీవీపీ మార్చి 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
YSRCP
Jagan
Andhra Pradesh
Vijayawada

More Telugu News