ambati rambabu: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఫైర్

  • చంద్రబాబు, లక్ష్మీనారాయణ తోడు దొంగలు
  • వీరి రహస్య ఒప్పందాలపై విచారణ జరిపించాలి
  • రెండు పత్రికలు జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయి
టీడీపీని ఓడించి, వైసీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలు తోడు దొంగల్లా వ్యవహరించారని... వీరిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రెండు పత్రికలు జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా వార్తలను రాస్తున్నాయని, చంద్రబాబు పాదాల దగ్గర ఉండి పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయనను మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. టీడీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే, లక్ష్మీనారాయణపై అంబటి విమర్శలు గుప్పించారు.
ambati rambabu
cbi
lakshminarayana
chandrababu
jagan
Telugudesam
ysrcp

More Telugu News