cbi: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో టీడీపీ నేతల భేటీ

  • లక్ష్మీనారాయణను కలిసిన టీడీపీ నేతలు
  • భీమిలి నుంచి పోటీ చేయాలని కోరిన గంటా
  • ఆలోచించి చెబుతానన్న లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేయాలని ఆయనను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు.

దీనికి సమాధానంగా... తాను ఆలోచించి చెబుతానని లక్ష్మీనారాయణ చెప్పారు. రెండు రోజుల క్రితం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే... లక్ష్మీనారాయణ టీడీపీ టికెట్ పై పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
cbi
lakshminarayana
ganta
Telugudesam
bheemili

More Telugu News