raviteja: దసరా పండుగపైనే దృష్టిపెట్టిన 'డిస్కోరాజా'

షార్ట్స్‌లో చూడండి
రవితేజను ఈ మధ్య పరాజయాలు సతమతం చేస్తున్నాయి. దాంతో తన తదుపరి సినిమాతో తప్పకుండా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ప్రస్తుతం ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టింది. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, బాబీసింహా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రవితేజ ఎప్పుడు వస్తాడా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. రవితేజ మాత్రం దసరాకి థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను దసరాకి రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ప్రాజెక్టును కూడా రవితేజ పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. తమిళంలో హిట్ కొట్టిన విజయ్ 'తెరి'కి ఇది రీమేక్.
Go Back to Shorts
raviteja
payal

More Telugu News